శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 9 ఏప్రియల్ 2022 (16:38 IST)

అఖిరాకు న‌ట‌నంటే ఇష్టంలేదంటున్న రేణుదేశాయ్

Akhira, Renudeshai,
Akhira, Renudeshai,
న‌టి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ త‌న కొడుకు గురించి వ‌స్తున్న వార్త‌ల‌ను ఖండించింది. కానీ అఖిరా బాక్సింగ్ చేస్తూ క‌ష్ట‌ప‌డుతున్న ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పెట్టింది. ఈ శుక్ర‌వార‌మే అఖిరా పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ఆమె పేర్కొంటూ, అఖిరాకు సినిమాలంటే ఇష్టం లేదు అంటూ స్పెష‌ల్ వీడియోలో పేర్కొంది. త‌ను మంచి మ‌న‌సున్న మ‌నిషి జెంటిల్‌మెన్ అంటూ కితాబిచ్చింది.
 
గ‌త కొంత‌కాలంగా అఖీరా సినిమాల్లోకి వ‌స్తున్న‌ట్లు మెగా అభిమానులు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు. ఫ‌లానా సినిమాలో అఖిరా ఎంట్రీ ఇస్తున్నాడంటూ వార్త‌లు కూడా వ‌చ్చాయి. అప్ప‌ట్లో ఖండించ‌ని రేణు దేశాయ్ ఈ పుట్టిన‌రోజు ఖండించింది. ఇప్ప‌టివ‌ర‌కు ఏ సినిమాకూ సైన్ చేయ‌లేదు అంటూ స్ప‌ష్టం చేసింది. అంటే ముందు ముందు చేస్తాడేమోన‌ని అభిమానులు ట్వీట్‌లు చేస్తున్నారు. తెలుగులోకంటే మ‌రాఠీలో న‌టుడిగా చేస్తాడేమోన‌ని కొంద‌రు అనుకుంటున్నారు. ఏమి జ‌రిగిద్దో చూడాలి.

ఇక రేణుదేశాయ్ తాజాగా ర‌వితేజ కొత్త చిత్రం టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావులో ప్ర‌ముఖ పాత్ర పోషిస్తోంది. ఇటీవ‌లే ఈ చిత్రం ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ఆమె హైద‌రాబాద్ వ‌చ్చింది. త్వ‌ర‌లో షూట్‌లో పాల్గొన‌నుంది.