శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 ఏప్రియల్ 2022 (10:41 IST)

వకీల్ సాబ్‌కు ఏడాది.. (video)

Vakeel Saab
వకీల్ సాబ్‌కు ఏడాది అయ్యింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ ఈ చిత్రం గత ఏడాది ఏప్రిల్ 9వ తేదీన విడుదల అయ్యింది. 
 
హిందీలో వచ్చిన పింక్ అనే సినిమాకు తెలుగులో రీమేక్‌గా వచ్చిన వకీల్ సాబ్‌గా వచ్చింది ఈ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్‌గా ఈ చిత్రంలో అలరించారు. 
 
ఈ సినిమాకు గాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి సుమారు 50 కోట్లు రూపాయల వరకు రెమ్యూనిరేషన్ దక్కిందని టాక్. ఇందులో పవన్ సరసన శ్రుతిహాసన్ నటించింది. ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నివేదా థామస్, అంజలి నటించారు.