రైతులను నట్టేట ముంచింది వాళ్లిద్దరే..? అంబటి రాంబాబు
టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రైతులను నట్టేట ముంచడం వల్లే ఇవాళ అక్కడక్కడా రైతుల ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయని వైకాపా నేత అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. రైతులను పచ్చి దగా చేసింది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కాదా? అని అంబటి ప్రశ్నించారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం చేసిన పాపాలకు చనిపోయిన రైతులకు దండలేసే కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ చేపట్టారు. కౌలు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు పవన్ కళ్యాణ్‌కు, చంద్రబాబుకు లేదని ఫైర్ అయ్యారు.
రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్‌ను చూసి భయపడే పరిస్థితి ఉంటుందా? ఎంత మంది కట్టకట్టుకుని వచ్చినా భయపడే ప్రసక్తే లేదని అంబటి చెప్పారు.