శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 6 ఏప్రియల్ 2022 (11:45 IST)

కౌలు రైతుల కోసం జనసేనాని పరామర్శ యాత్ర.. ఏప్రిల్ 12 నుంచి..

pawan kalyan
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు రూ. లక్ష ఆర్ధిక సాయాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించిన పవన్..ఇప్పుడు వారికీ నేరుగా ఆ సాయాన్ని అందజేసేందుకు సిద్దమయ్యారు. 
 
ఏప్రిల్ 12 నుండి ఈ పరామర్శ యాత్ర అనంతపురం నుంచి ప్రారభించబోతున్నారు. ఈ విషయాన్ని జనసేన నేత నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రెండేళ్లల్లో 1,857 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని.. తొలి ఏడాది 1019 మంది, రెండో ఏడాది 838 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు.
 
పవన్ తన పరామర్శ యాత్ర ద్వారా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు రూ. లక్ష ఆర్ధిక సాయాన్ని జనసేన తరపున అందిస్తారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. సీఎం జగన్ మళ్లీ పాదయాత్ర చేస్తే ప్రతి రైతు నిరసన తెలుపుతారని.. రైతులందరూ జగన్ ప్రభుత్వంపై మండిపడుతున్నారని అన్నారు.