గురువారం, 28 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 2 ఏప్రియల్ 2022 (18:06 IST)

ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.లక్ష సాయం ప్రకటించిన పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. పంట నష్టాలతో కొందరు రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేసారు. అన్నదాతలకు ఇటువంటి పరిస్థితి రావడం దారుణమన్నారు. చనిపోయిన రైతు కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు పవన్ ప్రకటించారు.

 
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... సాగును నమ్ముకున్న రైతన్న పరిస్థితి దయనీయంగా మారింది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు కొంతైనా జనసేన తరపున సాయం చేస్తాం. రైతు కుటుంబాలకు లక్ష రూపాయలు ఇస్తాము.

 
ఈ నగదు వారి పిల్లల చదువులకైనా ఆసరాగా వుంటాయని అనుకుంటున్నా. ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబాన్ని పరామర్శిస్తానని, త్వరలో వారివద్దకు వస్తాన''ని అన్నారు. కాగా గోదావరి జిల్లాల్లోనే ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్య 73 వరకు వుందని అన్నారు పవన్.