హరిహర వీరమల్లులో యాక్షన్ సీక్వెన్స్‌ను ప్రాక్టీస్ చేస్తున్న పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ యాక్షన్ సీన్స్ చేయడంలో ప్రత్యేకత వుంది. తెలుగులో ఏ హీరో చేయని విధంగా కరాటే తరహాలో జూడో ఫైట్‌ను ఆయన చేస్తుంటాడు. ఎ.ఎం.రత్నం నిర్మించింని ఖుషి సినిమాలో ఆయన చేసిన ఫైట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మళ్ళీ ఇన్నాళ్ళకు వీరి కాంబనేషన్‌లో హరిహర వీరమల్లు చిత్రం వస్తోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన కొంత పార్ట్ కూడా షూట్ చేశారు.
దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. గత కొద్దిరోజులుగా ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్ కోసం పవన్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. తైక్వాడ్ తరహాలో కరాటే ఫైట్‌ను ఇందులో చేయనున్నారు. ఇందులో విదేశీ ఫైటర్ల పర్యేవక్షణలో అన్నపూర్ణ స్టూడియోలో ఒక ఫ్లోర్‌లో సినిమా కోసం రిహార్సల్స్ చేస్తున్నారు.
ఈ ఫైట్ రిహార్సల్స్‌లో పవన్ కళ్యాణ్‌ను దర్శకుడు క్రిష్, నిర్మాత ఎ.ఎం. రత్నం దగ్గరుండి చూసుకుంటున్నారు. టోడోర్ లజారోవ్ ఆధ్వర్రయంలో యాక్షన్ ఎపిసోడ్ చేయనున్నారు. పవన్‌తోపాటు ఐదుగురు ఫైటర్లు కూడా ఇందులో పాల్గొన్నారు. సినిమాలో ఈ ఫైట్ ప్రత్యేక చాటుకోనున్నదని యూనిట్ చెబుతోంది.
కాగా ఈ సినిమా యాక్షన్ సీన్‌ను ఈనెల 8న అంటే శుక్రవారం చిత్రీకరించనున్నారు. ఇంతకుముందు రామోజీ ఫిలింసిటీలో కొంత భాగం చిత్రాన్ని షూట్ చేశారు. ప్రస్తుతతం పలు లొకేషన్లలో చేయనున్నారు. ఇందుకు కేరళ కూడా వెళ్ళనున్నారు.