బుధవారం, 21 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 ఏప్రియల్ 2022 (11:24 IST)

ఆర్ఆర్ఆర్ రికార్డ్ బ్రేక్.. కేజీఎఫ్-2 కొత్త రికార్డ్

Yash
ఆర్ఆర్ఆర్ సాధించిన కలెక్షన్లను కేజీఎఫ్-2 తాజాగా క్రాస్ చేసింది. కేరళలో ఇలాంటి రికార్డు మరే ఇతర డబ్బింగ్ సినిమాకు లేకపోవడం విశేషం. రాకింగ్ స్టార్ యశ్ పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌కు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. 
 
ఇక అధీరా పాత్రలో సంజయ్ దత్ నటించగా, ఈ సినిమాను హొంబాలే ఫిలింస్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేసింది. కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్2 ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.
 
కేజీయఫ్ చాప్టర్-1కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ ఆద్యంతం యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రావడంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. 
 
ఇక ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా రావడంతో కేజీఎఫ్-2 చిత్రాన్ని వీక్షించేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.