బాక్సాఫీస్‌లో "కశ్మీర్ ఫైల్స్" సునామీ.. రూ.100 కోట్లకు చేరువలో..
ఏమాత్రం అంచనాలు లేకుండా ఇటీవల విడుదలైన చిత్రం "కశ్మీర్ ఫైల్స్". ఇపుడు ఈ చిత్రం బాక్సాఫీస్‌లో సునామీ సృష్టిస్తుంది. విడుదలైన అతి కొద్ది రోజుల్లోనే ఏకంగా 100 కోట్ల రూపాయల మేరకు వసూలు చేసే దిశగా దూసుకెళుతుంది.
బుధవారం ఒక్కరోజే ఏకంగా రూ.19 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. దీంతో ఇప్పటివరకు మొత్తం కలెక్షన్లు రూ.78 కోట్లకు చేరుకున్నాయి. శుక్రవారం నాటికి ఈ కలెక్షన్లు రూ.100 కోట్లను క్రాస్ చేయొచ్చని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇదిలావుంటే ప్రముఖ రచయిత చేతన్ భగత్ ఈ చిత్రంపై విమర్శలు గుప్పించారు. కశ్మీర్‌లో పండిట్లు, హిందువులపై జరిగిన అకృత్యాలు, ఊచకోతలను యావత్ ప్రచంచానికి తెలియజెప్పే లక్ష్యంతో దర్శకుడు వివేక్ అగ్నిహోత్ని తీశారంటూ విమర్శలు చేశారు.
"ఫన్నీ ఏంటంటే భావ ప్రకటనా స్వేచ్ఛ గురించి తరచూ అడిగేవారే కశ్మీర్ ఫైన్స్ చిత్రానికి వచ్చేసరికి, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు" అంటూ చేతన్ భగవత్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.