గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 మార్చి 2022 (13:39 IST)

'బాహుబలి-2' తరహాలో 'ది కశ్మీర్ ఫైల్స్' కలెక్షన్లు...

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన "ది కశ్మీర్ ఫైల్స్" చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునానీ సృష్టిస్తుంది. గతంలో వచ్చిన "బాహుబలి-2" చిత్రం తరహాలో కలెక్షన్లు రాబడుతోంది. ఒక్క శనివారమే ఈ చిత్రం ఏకంగా రూ.24.8 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా విడుదలైన తొమ్మిది రోజుల్లో ఇప్పటివరకు రూ.141.25 కోట్లను కలెక్షన్లను రాబట్టింది. 
 
ఈ తొమ్మిది రోజుల్లో శనివారం వచ్చిన కలెక్షన్లే అత్యధికం కావడం కావడం. పైగా, ఈ చిత్రాన్ని ఐదు కోట్ల రూపాయల లోపు బడ్జెట్‌తో నిర్మించారు. కానీ, ఇపుడు కలెక్షన్లు సునామీ సృష్టిస్తుంది. శనివారమే రూ.24 కోట్లు వసూలు చేస్తే, ఆదివారం ఏకంగా రూ.30 కోట్ల మేరకు వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని బాలీవుడ్ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. 
 
కాగా, ఈ చిత్రం విడుదలైన తొలివారం కంటే రెండో వారంలోనే అత్యధిక కలెక్షన్లు రాబడుతుంది. రెండో వారంలో శుక్రవారం రోజున రూ.19.15 కోట్లు, శనివారం రూ.24.8 కోట్లు చొప్పున కలెక్షన్లు రాబట్టింది. ఆదివారం ఇదే తరహాలో కలెక్షన్లు ఉంటే సోమవారానికి ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం రూ.175 కోట్ల మేరకు కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని ప్రముఖ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ అభిప్రాయపడుతున్నారు.