శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 మార్చి 2022 (12:46 IST)

తెలుగులోకి కాశ్మీర్ ఫైల్స్..

90వ దశకంలో కాశ్మీర్ పండిట్‌లపై జరిగిన హత్యకాండను కథగా ఎంచుకుని కాశ్మీర్ ఫైల్స్ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను వివేక్ అగ్ని హోత్రి తెరకెక్కించగా.. తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఈ సినిమా నిర్మించారు.  సినిమా మార్చి 11న చిన్న సినిమాగా విడుదల అయింది
 
తక్కువ రోజుల్లోనే ఫుల్ క్రేజ్‌ను సొంతం చేసుకున్న కాశ్మీర్ ఫైల్స్ సినిమా ఏకంగా రూ. 100 కోట్ల కలెక్షన్లు చేసి ఔరా అనిపించింది. దేశ వ్యాప్తంగా అన్ని భాషల ప్రజలు ది కాశ్మీర్ ఫైల్స్‌‌ను ఆదరిస్తున్నారు
 
ఇకపోతే.. ఈ సినిమా తెలుగు ఫ్యాన్స్‌కు నిర్మాత అభిషేక్ అగర్వాల్ గుడ్ న్యూస్ చెప్పారు. అతి త్వరలోనే తెలుగు లోకి అనువాదం చేస్తామని ప్రకటించారు. దీంతో త్వరలో తెలుగు లో కూడా ది కాశ్మీర్ ఫైల్స్ సందడి చేయనుంది. 
 
అలాగే ఈ సినిమాను వెబ్ సిరీస్‌గా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నట్టు డైరెక్టర్ వివేక్ అగ్ని హోత్రి కూడా ప్రకటించారు.