శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated : మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (20:19 IST)

పవన్ కల్యాణ్: ‘ఇంకొకసారి నన్ను వాళ్లకు, వీళ్లకు దత్తపుత్రుడు అంటే జగన్‌ను సీబీఐకి దత్తపుత్రుడు అనాల్సి వస్తుంది’

Pawan kalyan
‘ఇంకొకసారి నన్ను వాళ్లకు, వీళ్లకు దత్తపుత్రుడు అంటే జగన్‌ను సీబీఐకి దత్తపుత్రుడు అనాల్సి వస్తుంది’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. 'జనసేనను టీడీపీ బీ టీమ్ అంటే వైసీపీని చర్లపల్లి జైలు షటిల్ టీమ్' అంటామని పేర్కొన్నారు.

 
అప్పుడు మీరు బాదుడే బాదుడు అన్నారు కదా. ఇప్పుడు మీరు చేస్తున్న పనిని ఏమనాలి? అని ఆయన జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అనంతపురం జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా పవన్ కల్యాణ్.. రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు.

 
రైతు కుటుంబాలను పరామర్శిస్తున్నామని తెలిసి, ప్రభుత్వం హుటాహుటిన వారికి నష్టపరిహారం చెల్లిస్తోందని పవన్ కల్యాణ్ అన్నారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి రూ.7 లక్షల ఆర్థిక సాయం ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.