బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 10 ఏప్రియల్ 2022 (11:03 IST)

సీఎం జగన్ సొంత జిల్లాలో కలవరపెడుతున్న పసికందుల మరణాలు

pawan kalyan
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో పసికందుల మరణాలు ప్రతి ఒక్కరినీ కలవరపరుస్తున్నాయి. జిల్లా కేంద్రమైన కడపలో రిమ్స్ ఆస్పత్రి ఈ మరణాలు వరుసగా సంభవిస్తున్నాయి. ఈ పసికందుల మరణాలపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. 
 
కడప రిమ్స్ ఆస్పత్రిలో జరుగుతున్న పసికందలు మరణాలపై ప్రభుత్వ వైఖరి సందేహాస్పదంగా ఉందన్నారు. పసిబిడ్డల తల్లిదండ్రులను పోలీసులతు ఎందుకు తరలించారు అంటూ ఆయన ప్రశ్నించారు. ఆ ఆస్పత్రిలో ముగ్గురు నవజాత శిశువుల మరణం మాటలకందని విషాదంగా ఆయన పేర్కొన్నారు. ఆస్పత్రిల విద్యుత్ సరఫరా లేకపోవడం, వైద్య ఉపకరణాలు వినియోగించకపోవడం వంటి కారణాలతో పసి బిడ్డలు కన్నుమూశారని ఆయన ఆరోపిచారు. 
 
ఒక్క మానిటర్‌తోనే 30 మంది పిల్లలకు వైద్య సేవలు చేశారని చెబుతున్న తల్లిదండ్రుల ఆవేదనను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఇంటువంటి ఘటన జరిగినపుడు తక్షణ తనిఖీలు చేసి విచారణ జరపాల్సిన జిల్లా కలెక్టర్ ఎందుకు మౌనంగా వహిస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.