బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 మార్చి 2022 (11:49 IST)

కడపలో అర్థరాత్రి వేళ అన్న క్యాంటీన్‌ను అలా కూల్చేశారు..

Kadapa
కడపలో అర్థరాత్రి వేళ అన్న క్యాంటీన్‌ను అధికారులు కూల్చివేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.  పేదలకు అతి తక్కువ ధరకు అల్పాహారం, భోజనం అందించాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లు నిర్వహించింది. 
 
కడపలోనూ రూ. 30 లక్షల వ్యయంతో దీనిని నిర్మించింది. అప్పట్లో రోజూ 500 మందికి ఇది కడుపు నింపేది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్ల నిర్వహణను పూర్తిగా ఆపేశారు. కరోనా సమయంలో కడప క్యాంటీన్‌ను కొవిడ్ కేంద్రంగా మార్చారు. 
 
అయితే, సోమవారం అర్ధరాత్రి ఈ భవనాన్ని అకస్మాత్తుగా కూల్చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. క్యాంటీన్‌లోని విలువైన, ఉపయోగపడే వస్తువులను కూడా బయటకు తీయకుండా అలాగే కూల్చివేయడం విమర్శలకు దారితీసింది.