గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 మార్చి 2022 (14:40 IST)

మంచంపై కూర్చొన్నవారిపైకి దూసుకెళ్లిన వ్యాను...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. జిల్లాలోని సీకే దిన్నె మండలంలో మద్దిముడుగులో ఈ ప్రమాదం జరిగింది. 
 
వేగంగా వెళుతున్న వ్యాను ఒకటి అదుపుతప్పి ఆరు బయట మంచంపై కూర్చొనివున్న నలుగురిపైకి దూసుకెళ్లింది. దీంతో నలుగురు మృతి చెందారు. కడప, బెంగుళూరు, జాతీయ రహదారి సమీపంలో ఉన్న గ్రామంలో కడప నుంచి రాయచోటికి వెళుతున్న జిప్సీ వ్యాన్ ఈ ప్రమాదానికి గురైంది. 
 
ఈ ప్రమాదంలో కొండయ్య, లక్ష్మీదేవి అనే ఇద్దరు సంఘటనలో మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ గాయపడిన ఇద్దరు యువతులైన అమ్ములు, దేవిని కడపలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. 
 
అయితే, వీరిద్దరు కూడా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో కొండయ్య, అమ్ములు భార్యాభర్తలు కాగా, లక్ష్మీదేవి, దేవి వారి ఇంటి పక్కనే ఉండే కుటుంబ సభ్యులని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు.