గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (16:48 IST)

గచ్చిబౌలి - ఐఐటీ జంక్షన్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు అనేక రకాలైన చర్యలు చేపడుతున్నప్పటికీ ఈ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నిత్యం రద్దీగా ఉండే గచ్చిబౌలి విప్రో జంక్షన్ నుంచి ఐఐటీ జంక్షన్ వైపు వెళుతున్న ద్విచక్రవాహనం ప్రమాదానికిగురైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. 
 
ట్రిబుల్ ఐటీ జంక్షన్ నుంచి సబ్ స్టేషన్ గేట్‌ను వేగంగా వచ్చిన ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వస్తున్న ముగ్గురు యువకుల్లో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ మృతులను అరవింద్ కుమార్ సాహో (28), మునిష్ కుమార్ సాకేత్ (25)లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, రాజ్‌ కుమార్ (21)కు మాత్రం తీవ్రంగా గాయాలయ్యాయి. 
 
గాయపడిన వ్యక్తిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి ఐసీయూ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఈ ముగ్గురు యువకులు నానకరామ్ గూడలోని ఓ రూంలో అద్దెకు ఉంటున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.