ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

నేడు సీఎం జగన్ రెండు జిల్లాల్లో పర్యటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదివారం రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. వీటిలో ఒకటి తన సొంత జిల్లా కడప ఒకటి. అలాగే, విశాఖలో కూడా ఆయన పర్యటిస్తారు. ఈ రెండు జిల్లాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
ఈ పర్యటనలో భాగంగా తొలుత ఆయన కడప జిల్లాకు వెళతారు. ఉదయం 11 గంటలకు కడపకు చేరుకునే సీఎం జగన్... అక్కడ  పుష్పగిరి విట్రియో రెటీనా ఐ ఇనిస్టిట్యూట్‌ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత కడప జయరాజా గార్డెన్స్‌లో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు. 
 
ఆ తర్వాత సాయంత్రం విశాఖ జిల్లా పర్యటనకు వెళతారు. సాయంత్రం 4.45 గంటల సమయంలో విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకునే సీఎం జగన్ అక్కడ నుంచి నేవల్ ఎయిర్‌‍స్టేషన్, ఐఎన్ఎస్ డే గా వద్ద భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కు స్వాగతం పలుకుతారు. విశాఖలో తన పర్యటన ముగించుకుని రాత్రి 7 గంటల సమయంలో తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు. కాగా, విశాఖకు రాష్ట్రపతి రానుండటంతో భారీ భద్రతా ఏర్పాటు చేశారు.