శనివారం, 1 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 మార్చి 2022 (13:24 IST)

కువైట్ సెంట్రల్ జైలులో కడప జిల్లా వాసి ఆత్మహత్య

కువైట్ సెంట్రల్ జైలులో కడప జిల్లా వాసి ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. హత్యా నేరం కింద అరెస్టు అయి ముద్దాయిగా తేలిన ఈ వ్యక్తిని కువైట్ జైలుకు తరలించగా అక్కడ బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడిని వెంకటేష్‌గా గుర్తించారు. 
 
కడప జిల్లాలోని దిన్నెపాలెం నివాసి వెంకటేష్ అనే వ్యక్తి కువైట్‌కు వెళ్లి సేథ్ అహ్మద్ అనే వ్యక్తి వద్ద కారు డ్రైవరుగా ఉద్యోగంలో చేరారు. అయితే, కొద్ది రోజుల తర్వాత అర్డియాలోని అహ్మద్ భార్య, కుమార్తె, మరో వ్యక్తిని హత్య చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. 
 
దీంతో కువైట్ పోలీసులు వెంకటేష్‌ను అరెస్టు చేశారు. విచారణలో నేరం చేసినట్టు అంగీకరించడంతో కోర్టు జైలుశిక్ష విధిందింది. దీంతో ఆయన్ను కువైట్ జైలుకు తరలించగా, అక్కడు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సివుంది.