శుక్రవారం, 6 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 12 మార్చి 2022 (20:37 IST)

రైలుకెదురుగా దూసుకెళ్లి యువకుడు సూసైడ్: చూసినవారికి మైండ్ మొద్దుబారిపోయింది

అంతా చూస్తూనే వున్నారు. రైలు వేగంగా వస్తుండగా ఓ యువకుడు ఫ్లాట్ఫాం పైనుంచి రైలు పట్టాలపైకి దూకి ఎదురుగా వస్తున్న రైలువైపు దూసుకెళ్లాడు. అంతే స్పాట్ డెడ్. ఆ హఠత్ సంఘటన చూసిన వారు కొయ్యబారిపోయారు.

 
వివరాల్లోకి వెళితే... తూర్పుగోదావరి జిల్లా తుని రైల్వే స్టేషనులో ఒకటవ నెంబరుపైన ఓ యువకుడు అటూఇటూ చలాకీగా తిరుగుతూ కన్పించాడు. ఇంతలో రెండవ ఫ్లాట్‌ఫాం పైకి వేగంగా విశాఖ ఎక్స్‌ప్రెస్ వస్తోంది. ఐతే చటుక్కున ఆ యువకుడు ఒకటవ ఫ్లాట్ ఫామ్ పైనుంచి రైలు పట్టాలపైకి దూకి వేగంగా వస్తున్న విశాఖ ఎక్స్ ప్రెస్ రైలుకి ఎదురుగా దూసుకెళ్లాడు. 

 
అంతా కేకలు వేస్తుండగానే అతడి శరీరం నలిగిపోయింది. ఆ దృశ్యాలు చూసిన వారు కొద్దిసేపు మొద్దుబారిపోయారు. ఈ యువకుడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియరాలేదు. పైగా అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తుతెలియని శవంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.