శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 26 ఫిబ్రవరి 2022 (12:22 IST)

నల్గొండలో కూలిన ట్రైనీ హెలికాఫ్టర్ - ఇద్దరు మృతి

తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో ఓ ట్రైనీ హెలికాఫ్టర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన జిల్లాలోని పెద్దవూర మండలం, తుంగతుర్తి సమీపంలోని రామన్నగూడెం తండా వద్ద సంభవించింది. 
 
ఈ ట్రైనీ విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. పైగా, ఈ హెలికాఫ్టర్ కిందపడగానే తునాతునకలైపోయింది. ఈ ప్రమాదంలో ఓ మహిళా పైలెట్‌‍తో సహా ట్రైనింగ్ పైలెట్లు ఉన్నట్టు సమాచారం. 
 
ఈ ప్రమాద వార్త తెలుసుకున్న స్థానిక పోలీసులు, వైద్యులు, రెస్క్యూ సిబ్బంది, అగ్నిమాపక దళ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ హెలికాఫ్టర్ విద్యుత్ స్తంభంపై కూలడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయని కొందరు స్థానికులు చెబుతున్నారు.