1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 ఫిబ్రవరి 2022 (13:59 IST)

పెరూలో కుప్పకూలిన విమానం.. ఏడుగురు మృతి

పెరూలో విమానం కుప్పకూలిన ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఐదుగురు పర్యాటకులు, ఫైలట్​ కోఫైలట్ ఉన్నారు. 
 
నాజ్కాలోని వైమానికి కేంద్రానికి సమీపంలో సెన్నా 207 వివామంన కూలిపోయింది. ఆ విమానం ఏరో శాంటోస్‌ అనే పర్యాటక సంస్థకు చెందినదిగా గుర్తించారు. పెరువియన్ ఎడారిలోని నాజ్కా లైన్ల పర్యటన కోసం సందర్శకులను తీసుకువెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. 
 
పెరూలో నాజ్కా లైన్లు ప్రపంచ  ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం. ఇక్కడికి విదేశీ పర్యాటకుల కోసం మారియా రీచే ఎయిర్‌ ఫీల్డ్‌ నుంచి ప్రతిరోజు డజన్ల కొద్ది విమానాలను నడుపుతారు.