సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 19 జనవరి 2022 (11:47 IST)

పంది, మేక, కోడి మాంసంఫై వ్యాఖ... చిన్న జీయర్ స్వామి దిష్టిబొమ్మ దహనం

శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ జీయర్ స్వామి పురాణం ప్రవచనాలు కూడా వివాదాస్పదం అవుతున్నాయి.  పంది, మేక, కోడి మాంసంఫై అయన చేసిన వ్యాఖలు దుమారం లేపాయి. జీయర్ స్వామిఫై ఎస్సి, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు. దళిత, బడుగు వర్గాల నేతలు  త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ జీయర్ స్వామి వ్యాఖలను తప్పు పడుతున్నారు. 

 
పంది మాంసం తింటే పంది బుద్ధులే వొస్తాయని చిన్న జీయర్ స్వామి వ్యాఖ్యలు చేసారు. అలాగే మేక మాంసం తింటే... మేక లాంటి బుద్ధులే వొస్తాయని, ఒక మేక వెనుక ఇంకో మేక వెళ్లినట్లు బుధ్ది పనిచేయదని చిన్న జీయర్ స్వామి చెప్పారు. ఇక కోడిని, కోడి గుడ్లను తింటే, కోడిలా అన్నిట్లో కెలకడం తప్ప ఏమి రాదనీ అయన చెప్పారు.  ఈ వ్యాఖలు కొందరికి కోపం తెప్పించాయి. చిన్న జీయర్ స్వామి బడుగు, బలహీన వర్గాలను కించపరిచేలా మాట్లాడారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
 
నల్గొండలో చిన్న జీయర్ స్వామి దిష్టిబొమ్మ దహనం చేసారు. పంది మాంసం తింటే పందిలాగే అవుతారని బడుగులను కించపరిచే వ్యాఖ్యలు చేసిన చిన్నజీయర్ స్వామి పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ ప్రజా సంఘాల వారు డిమాండ్ చేస్తున్నారు. కరోనా సమయంలో వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి డాక్టర్లు మాంసం తినమని సూచిస్తున్నారని, మరి చిన్న జీయర్ స్వామి దీనిఫై ఇలాంటి వ్యాఖలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మాంసం తినేవారిని కించపరిచేలా మాట్లాడిన చిన్న జీయర్ స్వామిఫై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.