శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 8 జనవరి 2022 (11:08 IST)

దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకుని, ఓకే కుటుంబానికి చెందిన నలుగురి ఆత్మ‌హ‌త్య‌

న‌ల్గొండ వాసులు న‌లుగురు విజయవాడకు అమ్మ‌వారి ద‌ర్శ‌నానికి వ‌చ్చి స‌త్రంలో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. ఓకే కుటుంబానికి చెందిన ఆ నలుగురు సూసైడ్ కు పాల్ప‌డ‌టం విషాదాన్ని నింపింది. విజ‌య‌వాడ‌లోని కన్యకా పరమేశ్వరి సత్రంలో తల్లీ కొడుకు విషం తాగి ఆత్మహత్యకు పాల్ప‌డ్డారు. అదే స‌మ‌యంలో కృష్ణా నదిలో దూకి తండ్రీ కొడుకు గల్లంతు అయ్యారు. ఈ కుటుంబం ఆఖ‌రిగా దుర్గమ్మ దర్శనానికి వచ్చి ఇక్క‌డ సూసైడ్ చేసుకుంది. వీరంతా తెలంగాణ ప్రాంతానికి చెందిన న‌ల్గొండ వాసులుగా గుర్తించారు. మృతులు పప్పుల సురేష్ (54), సురేష్ భార్య శ్రీలత, కుమారులు ఆశిష్, అఖిల్ గా గుర్తించారు. 
 
 
విజయవాడలో దుర్గ‌మ్మ ద‌ర్శ‌నం చేసుకుని, ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. కన్యకాపరమేశ్వరి సత్రంలో తల్లి, కుమారుడు విషం తాగి ఆత్మహత్య చేసుకోగా, తండ్రి, మరో కుమారుడు కృష్ణా నదిలో దూకారు. వీరు ముందే ఇలా చేస్తున్న‌ట్లు వాయిస్ మెసేజ్ పెట్టిన‌ట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.