కరోనా థర్డ్ వేవ్ ఎఫెక్ట్ : పడిపోతున్న బంగారం ధరలు
దేశంలో బంగారం, వెండి ధరలు క్రమేణా తగ్గిపోతున్నాయి. దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలు కావడంతో ఆ ప్రభావం బంగారం విక్రయాలపై కూడా ఉంది. ఫలితంగా మన దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా బంగారం, వెండి ఆభరణాల ధరలు తగ్గిపోతున్నాయి. దీనికితోడు అంతర్జాతీయ పరిస్థితులు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో బంగారానికి డిమాండ్ క్రమంగా తగ్గుతూ వస్తుంది.
రెండు రోజుల క్రితం గ్రాముకు రూ.300 మేరకు తగ్గిన బంగారం ధర శుక్రవారం మరో రూ.300 మేరకు తగ్గింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.380 తగ్గి రూ.47,847కు చేరుకుంది. అలాగే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,828కి పడిపోయింది.
రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా, హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో పసిడి ధర తగ్గుముఖం పట్టింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై రూ.210 తగ్గి, 49040గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44950కి చేరుకుంది. అలాగే, విజయవాడ నగరంలో హైదరాబాద్ నగరంలో ఉన్న దరలే ధరలే కొనసాగుతున్నాయి.