సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 డిశెంబరు 2021 (11:21 IST)

స్వల్పంగా పెరిగిన బంగారం - వెండి ధరలు

అంతర్జాతీయ మార్కెట్‌లో సానుకూలంగా ఉన్నప్పటికీ భారత్‌లో మాత్రం బంగారం, వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. ఈ ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉంది 
 
ఢిల్లీ, ముంబై, కోల్‌కత్తా నగరాల్లో వీటి ధరలు స్థిరంగా ఉండగా, హైదరాబాద్ నగరంలో మాత్రం కాస్త పెరిగింది. 10 గ్రాముల బంగారం ధరపై రూ.10 పెరగ్గా, కేజీ బంగారంపై రూ.100 పెరిగింది. 
 
హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,360గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రామాలు ధర రూ.49,490గా వుంది. కిలో వెండి ధర మాత్రం రూ.66,200గా వుంది. 
 
విజయవాడ నగరంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,360గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రామాలు ధర రూ.49,490గా వుంది. కిలో వెండి ధర మాత్రం రూ.66,200గా వుంది.