శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 జనవరి 2022 (12:12 IST)

నల్గొండ జిల్లాలో నరబలి - గుడివద్ద తల స్వాధీనం...

తెలంగాణా రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో నరబలి కలకలం సృష్టించింది. ఓ ఆలయం వద్ద తలను స్థానికులు గుర్తించారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలుపడంతో వారు అక్కడు వచ్చి మొండెం లేని తలను స్వాధీనం చేసుకుని మొండెం కోసం గాలిస్తున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నల్గొండ పట్టణంలోని విరాట్ నగర్ మైసమ్మ గుడి వద్ద ఈ తల కనిపించింది. దీన్ని చూసిన స్థానికులు హడలిపోయారు. 
 
ఈ ఆలయం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు నరబలి ఇచ్చి.. తలను అక్కడే వదిలిపెట్టి మొండెంను తీసుకెళ్లినట్టు అనుమానిస్తున్నారు. ఆలయం వద్ద రక్తపు మడుగులో ఉన్న తలను చూడగానే భయభ్రాంతులకు గురైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం చేరవేశారు. 
 
దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... తలను స్వాధీనం చేసుకన్నారు. దీనిపై కేసు నమోదు చేసి మొండెం కోసం గాలిస్త్ున్నారు. ఈ నరబలి ఘటన తర్వాత స్థానికులు ఆలయానికి వెళ్ళేందుకు హడలిపోతున్నారు.