ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 మార్చి 2022 (18:39 IST)

కైవ్‌లో రైళ్లు ఎక్కడానికి భారతీయులకు అనుమతి లేదా? ఏం జరుగుతోంది? (video)

భారతీయ విద్యార్థులు, ఇతర విదేశీయులను కైవ్‌లో రైళ్లు ఎక్కేందుకు అనుమతించడం లేదు. వోక్జాల్ రైల్వే స్టేషన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థి మంగళవారం ఒక వీడియోలో మాట్లాడారు.
 
ఉక్రెయిన్ రాజధానిలోని భారత రాయబార కార్యాలయం భారతీయులందరినీ అత్యవసరంగా నగరం నుండి నిష్క్రమించమని కోరిన కొన్ని గంటల తరువాత భారత రాయబార కార్యాలయం సలహా మేరకు భారతీయ విద్యార్థులు రైల్వే స్టేషన్‌కు వచ్చారని విద్యార్థి అన్ష్ పండిట్ వీడియోలో తెలిపారు. 
 
కానీ గార్డులు భారతీయులను లేదా విదేశీయులను అనుమతించడం లేదని చెప్పారు. భారత జెండాను వుంచినా ఫలితం లేదు. భారత రాయబార కార్యాలయం సాధ్యమైనంత త్వరగా మమ్మల్ని ఇంటికి చేర్చుతుందని ఆశిస్తున్నట్లు ఆ విద్యార్థి చెప్పారు.