ఆదివారం, 2 ఫిబ్రవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 మార్చి 2022 (16:18 IST)

ఫుట్‌బాల్ ప్రపంచ కప్ నుంచి రష్యాను బహిష్కరించాలి

ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌తో పాటు అన్ని అంతర్జాతీయ పోటీలు, ఇతర లీగ్ మ్యాచ్‌ల నుంచి రష్యాను బహిష్కరించాయి. తమ నిర్ణయం తదుపరి నోటీసులు ఇచ్చేంత వరకు అమల్లో ఉంటాయని ఫిఫా, యూఈఎఫ్ఏ ప్రకటించాయి. 
 
కాగా ఈ ఏడాది చివర్లో ఫుట్‌బాల్ ప్రపంచ కప్ జరగబోతుంది. అందుకోసం క్వాలిఫైయింగ్ ప్లే ఆఫ్ సెమీఫైనల్‌లో మార్చి 24న పోలాండ్‌తో రష్యా తలపడనుంది.
 
దీని తర్వాత స్వీడన్ లేదా చెక్ రిపబ్లిక్‌తో పోటీ పడే అవకాశం ఉంది. అయితే ఈ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లలో ఈ మూడు దేశాలు రష్యాతో ఆడటానికి నిరాకరించాయి. అంతే కాకుండా ఫుట్ బాల్ ప్రపంచ కప్ నుంచి రష్యాను బహిష్కరించాలని డిమాండ్ చేశాయి.