రష్యా-యుక్రెయిన్‌ల మధ్య చర్చలు.. బెలారస్ సరిహద్దుల్లో
రష్యా- యుక్రెయిన్ యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బెలారస్ సరిహద్దుల్లో రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 28 రష్యా-యుక్రెయిన్ మధ్య చర్చలు మొదలయ్యాయి. చర్చలకు ముందు బెలారస్ సంచలన ప్రకటన చేసింది. రష్యాపై ఆంక్షలు మరిన్ని పెంచితే మూడో ప్రపంచయుద్ధం తప్పదని హెచ్చరించింది.
చర్చలకు ముందు రష్యా, యుక్రెయిన్ చేసిన ప్రకటనలు తీవ్ర గందరగోళానికి గురిచేశాయి. యుక్రెయిన్ ఎయిర్‌స్పేస్ మొత్తం తమ ఆధీనంలో ఉందని రష్యా ప్రకటించింది. ఆ తర్వాత కాసేపటికే యుక్రెయిన్ భిన్నమైన ప్రకటన చేసింది. యుద్ధంలో నైతిక విజయం తమదేనని, రష్యా మానసిక స్థైర్యం కోల్పోయిందని, బలహీనపడిందని ఆరోపించింది.
మరోవైపు.. రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధ ఉద్రిక్తత కొనసాగుతోంది. సైన్యం మోహరింపు, బాంబు దాడులు జరుగుతూనే ఉన్నాయి. యుక్రెయిన్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకునే ప్రజలకు తాము సహకరిస్తామని రష్యన్ ప్రభుత్వం తెలిపింది.