1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (15:04 IST)

ఉక్రెయిన్‌లో వారాంతపు కర్ఫ్యూ ఎత్తివేత.. భారత విద్యార్థుల కోసం స్పెషల్ ట్రైన్స్

ఉక్రెయిన్‌లో వారంతాపు కర్ఫ్యూను ఎత్తివేసింది. ఇది భారతీయ విద్యార్థులకు ఎంతో వెసులుబాటు కలుగనుంది. పైగా, ఈ దేశంలో ఉన్న భారతీయ విద్యార్థులు సురక్షితంగా ఉక్రెయిన్ సరిహద్దులు దాటి వెళ్లేందుకు వీలుగా ప్రత్యేక రైళ్ళను నడుపనున్నారు. 
 
ప్రస్తుతం ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య భీకరంగా యుద్ధం జరుగుతుంది. ఈ కారణంగా ఆ దేశంలో ఉన్న పలు దేశాలకు చెందిన పౌరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఉక్రెయిన్‌లో ఉన్న భారత పౌరులు, విద్యార్థులను సురక్షితంగా తరలించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంది. ఇందుకోసం ఆపరేషన్ గంగ పేరుతో ప్రత్యేక విమానాలు నడుపుతుంది. 
 
అలాగే, ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులు, పౌరులను తరలించేందుకు వీలుగా వారాంతపు కర్ఫ్యూను ఎత్తివేశారు. దీంతో భారతీయ పౌరులను సురక్షితంగా తరలించేలా కేంద్రం చర్యలు తీసుకుంది. అంతేకాకుండా, ఉక్రెయిన్‌లోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని ఇతర దేశాల సరిహద్దులకు తరలించేందుకు వీలుగా కీవ్‌లోని భారత హైకమిషన్ ప్రత్యేక బస్సులను కూడా నపుడుపుతంది.