శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 మార్చి 2022 (17:24 IST)

రష్యా సైనికులు దమనకాండ.. ప్రజలపైకి కాల్పులు.. ఈ కాల్పుల్లోనే నవీన్ మృతి

ఉక్రెయిన్‌లో జరుగుతున్న భీకర యుద్ధంలో రష్యా సైనికులు విచక్షణా రహితంగా ప్రజలపైకి కాల్పులు జరుపుతున్నారు. ఒకవైపు యుద్ధ ట్యాంకులు ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. మరోవైపు యుద్ధ ట్యాంకుల వెనుక నుంచి ప్రజలపై రష్యా సైనికులు విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతున్నారు. దీంతో అనేక మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి వారిలో కర్నాటకకు చెందిన వైద్య విద్యార్థి నవీన్ కూడా ఉన్నారు. 
 
రష్యా సైనికులు జరుపుతున్న భీకర దాడుల నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడేందుకు అనేక మంది ప్రజలు ప్రాణాలను అరచేతిలో పట్టుకుని సరిహద్దులను దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, కీవ్ నగరం నుంచి ఈ సరిహద్దులకు చేరుకోవడం వారికి ప్రాణాంతకంగా మారింది. అలా సరిహద్దులు దాటిన 1500 మందిని భారత ప్రభుత్వం స్వదేశానికి తీసుకొచ్చింది. 
 
అయితే, మరికొందరు సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించారు. అదేసమయంలో ఓ వైపు బాంబులేస్తూ రష్యా యుద్ధ ట్యాంకులు సాగితే, అత్యాధునిక తుపాకులు చేతబట్టిన రష్యా సైనికులు కనిపించి జనంపై బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నారు. 
 
ఈ కాల్పుల్లోనే నవీన్ ప్రాణాలు కోల్పోయాడు. రష్యా సేనలు అక్కడికి చేరుకోవడానిక కాస్తంత ఆలస్యమైనా, లేదంటే ఇంకాస్త ముందుగా నవీన్ బయలుదేరివున్నా ప్రాణాలతో బయటపడేవారు. కానీ, విధి వక్రీకరించి ఉక్రెయిన్ సరిహద్దుల్లో నీవన్ మృత్యువుగా పడివున్నాడు.