1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. The long awaited Roadies has started - Sonu Sood

ఎన్నాళ్ళోగా ఎదురుచూస్తున్న రోడీస్ ప్రారంభ‌మైంది - సోనూసూద్

Sonu Sood
Sonu Sood Roadies shoot
సోనూ సూద్ రోడీస్‌తో తన అనుబంధాన్ని ప్రకటించినప్పటి నుండి, కొత్త సీజన్ చుట్టూ ఉన్న ఉత్సాహం ప్రేక్షకులలో స్పష్టంగా కనిపిస్తుంది. దేశమంతా అభిమానుల్ని పొందిన సోనూసూద్ ఇప్పుడు టెలివిజన్ స్క్రీన్‌పై రావ‌డం ఒక ట్రీట్‌గా భావిస్తున్నారు. 
 
ఇది రియాలిటీ షో. ఇది ఎప్పుడు ప్రదర్శన అనేది ఇంకా నిర్ధారణ లేదు, కానీ మా వద్ద అద్భుతమైన అప్‌డేట్ ఉంది, అది మిమ్మల్ని ఉర్రూతలూగిస్తుంది. సోనూ సూద్ తన రోడీస్ జర్నీని ప్రారంభించిన ఈరోజు నుండి రియాల్టీ షో షూటింగ్‌ను ప్రారంభించాడని నిర్వాహ‌కులు శివరాత్రి నాడు ప్ర‌క‌టించారు.
 
Sonu Sood Roadies shoot-1
దీనిపై సోనూ సూద్ ఇలా స్పందించాడు. "రోడీస్ షూట్‌ను ప్రారంభించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇది చాలా సంవత్సరాలుగా నేను ఎదురుచూస్తున్న  ఒక రియాలిటీ షో,  ఇందులో నా ప్ర‌తిభ‌ను జోడించడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇది నాకు ఖచ్చితంగా తెలుసు. మరెక్కడా లేని ప్రయాణం అవుతుంది."
 
కొత్త లీడర్-హోస్ట్ అవతార్ ఆఫ్ రోడీస్‌లో సోనూ సూద్‌ను చూడటానికి దేశవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. సోనూ ఎంట్రీతో షో పై అంచనాలు మరింత పెరిగాయి. 
ఇదిలా వుండ‌గా,  సోనూ సూద్ రాబోయే చిత్రాలు విడుద‌ల‌కు సిద్ధంగా వున్నాయి. చంద్రప్రకాష్ ద్వివేది హిస్టారికల్ ఎపిక్ యాక్షన్ డ్రామా, పృథ్వీరాజ్, కొరటాల శివల ఆచార్య ఉన్నాయి. 
About Writer
డీవీ
తర్వాతి కథనం
భోళాశంకర్ నుంచి తాజా అప్డేట్