సోనూ సూద్‌కు వార్నింగ్ ఇచ్చిన పంజాబ్ అధికారులు
పంజాబ్ శాసనసభకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా, ఆదివారం ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. మొగా నియోజకవర్గంలో సోనూ సూద్ సోదరి మాళవికా పోటీ చేస్తున్నారు. అయితే మోగాలోకి సోనూ సూద్ వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ, ఆయన్ను అడ్డుకున్నారు. సోనూ సూద్‌పై శీరోమణి అకాలీదళ అభ్యర్థి బర్జీందర్ సింగ్ అలియాస్ మఖాన్ బ్రార్ ఫిర్యాదు మేరకు అధికారులు ఈ చర్య తీసుకున్నారు.
సోనూ సూద్‌ను అడ్డుకున్న అధికారులు ఆయన కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన్ను ఇంటికి పంపించారు. అయితే, ఇంటి నుంచి బయటకు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు మొగా జిల్లా పీఆర్ఓ దీప్ సింగ్ వెల్లడించారు. అలాగే, ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని మొగా ఎస్పీని జిల్లా మేజిస్ట్రేట్, కలెక్టర్ హరీశ్ నయ్యర్ ఆదేశించారు.
అయితే, తన పట్ల పంజాబ్ అధికారులు ప్రవర్తించిన తీరుపై సోనూ సూద్ అధికారులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తనపై ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమన్నారు. ప్రత్యేకించి ఓ పార్టీకి గానీ, ఓ అభ్యర్తికిగాని ఓటు వేయాలని తాను ఎవరినీ ఆడగలేదని చెప్పారు. పోలింగ్ కేంద్రాల వెలుపల ఏర్పాటు చేసిన కాంగ్రెస్ శిబిరాలను సందర్శించడానికి వెళ్ళానని, ఓటర్లను ప్రభావితం చేసేందుకు కాదని చెప్పారు.