శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 మార్చి 2022 (15:26 IST)

బరాకర్ నదిలో పడవ ప్రమాదం : 14 మంది జలసమాధి

జార్ఖండ్ రాష్ట్రంలోని జామ్‌తాడ జిల్లాలోని బరాకర్ నదిలో పడవ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 14 మంది జలసమాధి అయ్యారు. సమాచారం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటివరకు 14 మృతదేహాలను వెలికి తీశారు. ఈ మృతదేహాలను గుర్తించి వారివారి బంధువులకు అప్పగించారు. మృతి చెందిన వారిలో ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు మహిళలు కూడా ఉన్నట్టు జమార్తా డిప్యూటీ కమిషనర్ పైజ్ అహ్మద్ ముంతాజ్ వెల్లడించారు. 
 
కాగా, ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి చెందిన ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ వెల్లడించారు. గత నెల 24వ తేదీన సాయంత్రం 6 గంటలకు బరాకర్ నదిలో జామ్‌తాడ నుంచి నిర్సాకు వెళుతున్న బోటు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో వీచిన బలమైన ఈదురుగాలులు, తుఫాను వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు.