గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 9 జనవరి 2022 (11:22 IST)

జార్ఖండ్ ముఖ్యమంత్రి ఇంట్లో కరోనా కలకలం - 15 మందికి పాజిటివ్

జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ నివాసంలో కరోనా కలకలం చెలరేగింది. ఆయన భార్యాపిలలతో పాటు.. ఏకంగా 15 మందికి ఈ వైరస్ సోకింది. ప్రస్తుతం దేశంలో కరోనా థర్డ్ వేవ్ దెబ్బకు భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా కరోనా వైరస్ వ్యాపిస్తుంది. 
 
ఈ పరిస్థితుల్లో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో హేమంత్ సోరేన్‌ సతీమణిపాటు 15 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. అయితే, సీఎం హేమంత్‌కు మాత్రం నెగెటివ్ ఫలితం వచ్చిందని అధికారులు వెల్లడించారు. 
 
ముఖ్యమంత్రి నివాసంలో ఇప్పటివరకు 62 మందికి కోవిడ్ పరీక్షలు చేసినట్టు రాంచీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ వినోద్ కుమార్ వెల్లడించారు. వీరిలో 24 మందికి ఫలితాలు రాగా, అందులో 15 మందికి పాజిటివ్ ఫలితం వచ్చిందని తెలిపారు. 
 
ఇందులో సీఎం హేమంత్ భార్య కల్పనా సొరేన్, వారి ఇద్దరు కుమారులు నితిన్, విశ్వజిత్, కోడలు సరళా ముర్ములు ఉన్నారని తెలిపారు. ఈ నివాసంలో ఉన్నవారందరికీ తేలికపాటి కోవిడ్ లక్షణాలు ఉండటంతో సెల్ఫ్ హోం క్వారంటైన్‌లో ఉంచినట్టు తెలిపారు.