సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 డిశెంబరు 2021 (18:06 IST)

మహేష్ బాబు ఇంట్లో కరోనా కలకలం: నమ్రత సోదరికి కోవిడ్

shilpa
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. మహేష్ వదిన, నమ్రతా అక్క అయినా శిల్పా శిరోద్కర్ కరోనా బారిన పడ్డారు. శిల్పా కూడా ఒకనాటి బాలీవుడ్ నటి. హమ్, ఖుదా గవా మరియు ఆంఖేన్ వంటి సినిమాలలో హీరోయిన్‌గా నటించిన శిల్పా ప్రస్తుతం దుబాయ్‌లో నివసిస్తున్నారు.  
 
శిల్పా శిరోద్కర్ కోవిడ్-19  అని నిర్ధారణ కాగానే స్వయంగా క్వారంటైన్ చేసుకుంది. "కోవిడ్ పాజిటివ్" అనే శీర్షికతో సోషల్ మీడియాలో తన నాల్గవ రోజు నిర్బంధం నుండి ఒక చిత్రాన్ని పంచుకుంది.
 
ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండండి, దయచేసి వ్యాక్సిన్ పొందండి. అన్ని నిబంధనలను పాటించండి... మీకు ఏది మంచిదో మీ ప్రభుత్వానికి తెలుసు. అంటూ తెలిపింది. శిల్పాకు కోవిడ్ పాజిటివ్ అని తేలగానే ఆమె సన్నిహితులు సైతం కోవిడ్ పరీక్షలు చేయించుకుంటున్నారు.