మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 డిశెంబరు 2021 (18:48 IST)

శిల్పా చౌదరికి బెయిల్- అదీ ఒక్క కేసులోనే

టాలీవుడ్ సెలెబ్రిటీలకు చుక్కలు చూపించి.. కోట్లు మోసం చేసిన శిల్పా చౌదరికి బెయిల్ లభించింది. కానీ ఒక్క కేసులో మాత్రమే ఆమెకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. 
 
శిల్ప చేతిలో మోసపోయిన వారిలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సోదరి ప్రియదర్శిని కూడా ఉన్నారు. తమను రూ.7 కోట్ల మేర మోసగించినట్టు శిల్పా చౌదరిపై ముగ్గురు మహిళలు ఫిర్యాదు చేశారు. ఈ మూడు కేసుల్లో ఒక్కదానిలో మాత్రమే శిల్పాచౌదరికి బెయిల్ లభించింది. 
 
మరో రెండు కేసుల్లో బెయిల్ నిరాకరించింది. దివ్యారెడ్డి ఫిర్యాదుతో నమోదైన కేసులో శిల్పా చౌదరికి ఉప్పర్ పల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. పలువురిని మోసం చేసిన కేసులో శిల్పా చౌదరి అరెస్టయిన సంగతి తెలిసిందే.