సోమవారం, 22 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 డిశెంబరు 2021 (09:23 IST)

'క్లబ్ టాలీవుడ్' క్లబ్‌లో అసభ్య నృత్యాలు... అమ్మాయిల అరెస్టు

హైదరాబాద్ నగరంలోని క్లబ్ టాలీవుడ్‌లో అసభ్య నృత్యాలు చేస్తుండగా పోలీసులు రంగ ప్రవేశం చేసి పలువురు అమ్మాయిలు, నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. బేగంపేటలో ఉన్న క్లబ్ టాలీవుడ్‌ పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా నిర్వాహకులు వేణుగోపాల్, సాయిభరజ్వాజ్‌లతో పాటు 33 మంది పురుషులు, 9 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. అయితే, పబ్ మేనేజరు రాము పరారీలో ఉన్నారు. మరో ఇద్దరు మేనేజర్లతో పాటు మొత్తం 42 మందిని అదుపులోకి తీసుకున్న నార్తో జోన్ టాస్క్ ఫోర్స్ పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు 
 
వీరివద్ద జరిపిన విచారణలో గతంలో లిస్టన్ క్లబ్ పేరుతో పబ్‌ను నిర్వహించినట్టు తేలింది. అపుడు ఆ క్లబ్‌ను మూసివేయడంతో ఇపుడు పేరు మార్చి ఈ దందా కొనసాగిస్తూ వచ్చినట్టు తేలింది. దీంతో ఈ క్లబ్‌ను ఇపుడు సీజ్ చేశారు.