1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Hardik Pandya refuted reports that claimed two wrist watches worth Rs 5 crore were seized

నా వద్ద నుంచి రూ. 5 కోట్ల విలువైన వాచీలు స్వాధీనం చేసుకున్నారా? పాండ్యా ట్వీట్

Hardik Pandya
దుబాయ్ నుండి తిరిగి వచ్చినప్పుడు ముంబై విమానాశ్రయంలో తన నుండి రూ. 5 కోట్ల విలువైన రెండు చేతి గడియారాలను స్వాధీనం చేసుకున్నట్లు వచ్చిన వార్తలను క్రికెటర్ హార్దిక్ పాండ్యా మంగళవారం ఖండించారు. కేవలం రూ. 1.5 కోట్ల విలువైన ఒక వాచ్ మాత్రమే సరైన వాల్యుయేషన్ కోసం తీసుకున్నారని చెప్పాడు.

 
పాండ్యా ట్విట్టర్‌లో ఒక ప్రకటనను పోస్ట్ చేస్తూ, "నేను తీసుకువచ్చిన వస్తువులను చూపెట్టి అవసరమైన కస్టమ్స్ డ్యూటీని చెల్లించడానికి నేను స్వచ్ఛందంగా ముంబై విమానాశ్రయం కస్టమ్స్ కౌంటర్‌కు వెళ్లాను. కస్టమ్స్‌కు నా డిక్లరేషన్‌పై సోషల్ మీడియాలో తప్పుడు అవగాహనలు వెల్లువెత్తుతున్నాయి. ముంబై విమానాశ్రయంలో ఏమి జరిగిందో నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను."

 
"నేను దుబాయ్ నుండి చట్టబద్ధంగా కొనుగోలు చేసిన అన్ని వస్తువులను స్వచ్ఛందంగా ప్రకటించాను. చెల్లించాల్సిన సుంకాలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాను. వాస్తవానికి, కస్టమ్స్ విభాగం సమర్పించిన అన్ని కొనుగోలు పత్రాలను కోరింది. అవి నేను సమర్పిస్తున్నాను. ఇంతలో మీడియాలో రాద్దాంతం చేస్తున్నారు'' అని ఆగ్రహం వ్యక్తం చేసారు.
తర్వాతి కథనం
కరోనా దేశం నుంచి పోతుందా? 9 నెలల్లో అత్యంత తక్కువ కేసులు నమోదు