1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 28 అక్టోబరు 2021 (10:32 IST)

కొబ్బ‌రికాయ‌ల మాటున ర‌వాణా; రూ.2 కోట్ల గంజాయి పట్టివేత

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో గంజాయి ఒక రాజ‌కీయ అంశంగా మారిపోయి, భారీగా వివాదాలు జ‌రుగుతున్న త‌రుణంలో గంజాయిపై టాస్క్ ఫోర్స్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. స‌రిహ‌ద్దుల్లో గంజాయి అక్ర‌మ ర‌వాణాపై దృష్టి సారించారు. చింతూరు ఫారెస్ట్ నుంచి ర‌వాణా అవుతున్న గంజాయిని మాటు వేసి ప‌ట్టుకుంటున్నారు.
 
తూర్పు గోదావరి జిల్లా చింతూరు పరిధిలో రూ.2 కోట్ల విలువైన గంజాయిని మోతుగూడెం వద్ద పోలీసులు పట్టుకున్నారు. చింతూరు ఏఎస్పీ కృష్ణకాంత్ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ, మోతుగూడెం పోలీస్ స్టేషన్ వద్ద తని ఖీలు చేస్తుండగా విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దుల నుంచి హైదరాబాద్కు కొబ్బరికాయలు మాటున తరలిస్తున్న 2000 కిలోల గంజాయిని పట్టు కున్నామ‌ని చెప్పారు.
 
గంజాయితో పాటు వ్యాన్, కారు, మూడు చర వాణులు, రూ.2 వేల నగదును స్వాధీనం చేసుకున్నామ‌ని   వివరించారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా లింగాపురం మండలం కొత్తపల్లికి చెందిన న్యాయవాది కడియం గురుసాగర్, నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం, చెందిన పొగిడాల పర్వతాలు, ఒడిశాలోని మల్కాన్ గిరి జిల్లా చిత్రకొండ మండలం కూర్మనూర్కు చెందిన నైని రామారావును అరెస్టు చేసినట్లు ఏఎస్పీ కృష్ణకాంత్ వెల్లడించారు. సీఐ యువకుమార్, ఎస్సై సత్తిబాబు ఈ దాడుల్లో పాల్గొన్నారు.