రూల్ ఆఫ్ లాకు వ్యతిరేకంగా జడ్జిమెంట్లు ఉన్నాయి: జస్టిస్ చలమేశ్వర్
రూల్ ఆఫ్ లాకు వ్యతిరేకంగా వచ్చిన జడ్జిమెంట్లు చాలా ఉన్నాయని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ అన్నారు. న్యాయ వవస్థను కాచి వడపోసిన జస్టిస్ చలమేశ్వర్ తనదైన శైలిలో స్పందించారు. రూల్ ఆఫ్ లా కు వ్యతిరేకంగా వచ్చిన జడ్జిమెంట్లపై కోర్టులో అప్పీలు పెట్టిన ఉద్దేశం కూడా అందుకేనన్నారు.
ప్రస్తుత న్యాయ వ్యవస్థలో పొరపాట్లు జరుగుతున్నది నిజమేనని జస్టిస్ జాస్తి చలమేశ్వర్ స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థకు, కార్యనిర్వాహక వ్యవస్థకు మధ్య స్పర్ధలు ఉన్నది నిజమేనన్నారు. ఈ రెంటి మధ్య ఉన్న గ్యాప్ వల్ల ఒక్కోసారి కక్షిదారులకు అసంపూర్తిగా న్యాయం జరుగుతున్నట్లు వివరించారు. అయితే, ఈ రెండు వ్యవస్థల మధ్య స్పర్ధలు మన దేశానికే మాత్రమే పరిమితం కాలేదని ఆయన చెప్పారు. జడ్జిలు ఇచ్చిన తీర్పులు తప్పని చెప్పడంలో తప్పులేదు... కానీ విమర్శలు చేయకూడదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ సూచించారు.