ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 అక్టోబరు 2021 (15:09 IST)

''రొమాంటిక్'' హీరోయిన్‌ బాత్రూంలో ప్రభాస్‌..? అసలేం జరిగింది?

prabhas
బాహుబలి ప్రభాస్‌కు వున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఓ ఇంటర్వూలో ప్రభాస్‌ చేసిన కామెడీ.. సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. రొమాంటిక్‌ డేట్‌ విత్‌ ప్రభాస్‌ అంటూ పూరి తనయుడు ఆకాష్‌, కేతిక శర్మ చేసిన సందడి నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మాస్‌ డైరెక్టర్‌ పూరీ నిర్మాతగా వ్యవహరించిన లెటేస్ట్‌ మూవీ… రొమాంటిక్‌. ఈ సినిమా ట్రైలర్‌ను ఇటీవలే విడుదల చేసి రెబల్‌ స్టార్‌.
 
అనంతరం.. ఆకాష్‌, కేతిక శర్మలతో స్పెషల్‌ ఇంటర్వూలో పాల్గొన్నారు. ఇక ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్‌ చేసిన కామెడీ, పంచ్‌లు హైలెట్‌‌గా నిలిచాయి. కేతిక తనను తాను ఈ ఇంటర్వ్యూలో పరిచయం చేసుకుంటూ… "హాయ్‌ సార్‌, నేను ఢిల్లీ నుంచి కేతికను" అని చెప్పగా.. "హాయ్‌ మేడమ్‌,… నేను మొగల్తూరుకు చెందిన ప్రభాస్" అంటూ రెబల్‌ స్టార్‌ బదులిచ్చారు.
 
ఇక హీరోయిన్‌‌ను పాట పాడమంటూ ఆకాష్‌ అడగ్గా… కేతిక సిగ్గు పడిపోతూ.. తాను బాత్రూం సింగర్‌ అంటూ దాటవేసే ప్రయత్నం చేసింది. అయితే.. ఆకాష్‌ మాత్రం వదలకుండా ఇది బాత్రూం అనుకో.. నేను…రెబల్‌ ఇక్కడ లేమనుకో… ఏమంటావ్‌ ప్రభాస్‌ అన్న… అనగానే… కేతిక బాత్రూంలో నేను ఎందుకు ఉంటారా? అంటూ పంచ్‌ పేల్చారు ప్రభాస్‌. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌‌గా మారింది. కాగా.. రొమాంటిక్‌ సినిమా ఎల్లుండి అంటే అక్టోబర్‌ 29వ తేదీన విడుదల కానుంది.