బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 27 అక్టోబరు 2021 (12:54 IST)

తిరుమల శ్రీవారికి తమిళ భక్తుడు రూ. 1.83 కోట్ల బంగారు బిస్కెట్లు

తిరుమల శ్రీ వేంకటేశ్వరుడు కోరిన కోర్కెలు తీర్చే దైవం. ఆ దైవం చల్లని దీవెనల కారణంగా సుఖసంతోషాలతో వున్నామని భక్తులు విశ్వసిస్తారు. తమ మొక్కులు తీర్చుకుంటూ వుంటారు. తాజాగా తమిళనాడు కోయంబత్తూరుకి చెందిన వ్యాపారి శ్రీవారికి రూ. 1.83 కోట్లు విలువైన బంగారం బిస్కెట్లు కానుకగా సమర్పించారు.
 
తితిదే ఈవో ధర్మారెడ్డికి బంగారు బిస్కెట్లను అందించారు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ సాగుతోంది. నిన్న 27 వేల మంది భక్తులు తిరుమలేశుడిని దర్శించుకున్నారు.