శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 19 అక్టోబరు 2021 (15:25 IST)

భక్తులు నమ్మొద్దండి, ఆ దర్సనం పునరుద్ధరించలేదు: టిటిడి

కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో 2020, మార్చి 20వ తేదీ నుంచి వృద్థులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్సనాలను నిలిపివేయడం జరిగింది. ఇప్పటికి కూడా కోవిడ్ పూర్తి అదుపులోకి రానందువల్ల వీరి దర్సనాల విషయంలో ఇదే స్థితి కొనసాగుతోంది. 
 
అయితే గత కొన్నిరోజులుగా సామాజిక మాథ్యమాల్లో తిరుమలలో వృద్థులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్సనాలు పునరుద్ధించినట్లు అవాస్తవ సమాచారం ట్రోల్ అవుతోందని టిటిడి ఒక ప్రకటనలో తెలిపింది.
 
అనేకమంది ఇది నిజమని నమ్మి తిరుపతికి వచ్చి ఇబ్బందులు పడే అవకాశం ఉంది. భక్తులు ఈ విషయం గుర్తించాల్సిందిగా టిటిడి విజ్ఞప్తి చేసింది. కోవిడ్ పూర్తిగా అదుపులోకి వచ్చాక ఈ దర్సనాల పునరుద్ధరణపై తగిన నిర్ణయం తీసుకుని మీడియా ద్వారా భక్తులకు తెలియజేయడం జరుగుతుందని టిటిడి ఆ ప్రకటనలో తెలిపింది.
 
అధికారిక ప్రకటన వెలువడే వరకు సామాజిక మాధ్యమాల్లో వచ్చే అవాస్తవ సమాచారాన్ని నమ్మవద్దని టిటిడి కోరుతోంది. గత వారంరోజులుగా సామాజిక మాధ్యమాల్లో సందేశాలు ట్రోల్ అవుతూనే ఉన్నాయి. దీంతో టిటిడి ఈ ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది.