1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
  4. Vastu Shastra Rules for Wearing a Watch to Attract Wealth

Vastu for Wearing a Watch: కుడి లేదా ఎడమ.. ఏ చేతికి వాచ్ కట్టాలో తెలుసా?

Watch
Watch
వాస్తు శాస్త్రం ప్రకారం ఏ చేతిలో వాచ్ కట్టాలనే దానిపై ఓ పరిశీలన చేద్దాం. రోజువారీ జీవితంలో ఎక్కువ సమయం వాడే వస్తువుగా చేతికి కట్టే వాచ్‌ను చెప్పవచ్చు. ఇంటబయటా వాచ్, గడియారం లేనిదే పొద్దుగడవదు. టైమ్ చూడకుండా ఏ పని జరగదు. ముఖ్యంగా చేతికి వాచ్ కట్టడంపై వాస్తు ప్రకారం ఎలాంటి సూచనలు పాటించాలో చూద్దాం. 
 
కుడిచేతికి వాచ్ కడితే, శరీరంలో కుడివైపునున్న నాడీ మండలాన్ని మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది. ఇంకా సూర్యభగవానుడి శక్తిని ప్రతిబింబిస్తుంది. కుడి చేతికి కట్టడం ద్వారా శక్తి, ప్రోత్సాహం మరియు ధైర్యం అందించే. ఆ విధంగా, మీ వ్యక్తిగత అభివృద్ధి,  వృత్తి విజయానికి సహాయం చేస్తుంది.
 
అదేవిధంగా ఎడమచేతికి వాచ్ కట్టడం ద్వారా ఎడమవైపునున్న నాడీ మండలాన్ని ఉత్తేజపరుస్తుంది. అంతేకాదండోయ్ సంపదను ఆకర్షించాలంటే ఎడమచేతికి వాచ్ కట్టాలని వాస్తు నిపుణులు అంటున్నారు. ఆర్థికపరమైన అభివృద్ధికి ఎడమచేతిలో వాచ్ కట్టడం శ్రేయస్కరమని వాస్తు శాస్త్రం చెప్తోంది. 
 
కాబట్టి వ్యక్తిగతంగా ఆర్థికపరమైన వృద్ధికి ఎడమ చేతిలో కట్టడం మంచిది. కుడివైపు కట్టినా ఆరోగ్యపరమైన ఇబ్బందులుండవు. సూర్య భగవానుడి అనుగ్రహంతో అన్నీ విజయాలే చేకూరుతాయి. దీనిని బట్టి కుడిఎడమ తేడా లేకుండా ఏ చేతిలోనైనా వాచ్ కట్టడం చేయొచ్చు.  
 
ఎలాంటి రంగు వాచ్‌లు వాడాలంటే?
తెలుపు రంగు వాచ్ లను కట్టడం ద్వారా స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటారు. విజయాన్ని సంపాదించి పెడుతుంది. అలాగే గోల్డ్ కలర్ వాచ్‌లు ధరించడం ద్వారా ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక వృద్ధి వుంటుంది. సిల్వర్ కలర్ వాచ్‌లు కడితే వ్యక్తిగత వికాసం, వృత్తిపరమైన వృద్ధి ఏర్పడుతుంది. నలుపు రంగు వాచ్‌లను కడితే ధైర్యం, దృఢ సంకల్పంతో వుంటారు. ఆత్మ విశ్వాసం పెంపొందుతుంది. అనుకూల శక్తి ఏర్పడుతుంది. 
 
అలాగే ఓవల్ షేప్ చేతి గడియారాలను ధరిస్తే స్పష్టత ఏర్పడుతుంది. మానసిక ఆందోళనలు దూరమవుతాయి. ట్రయాంగిల్ వాచ్‌లను ధరించకపోవడం మంచిది. ఎందుకంటే ఇవి మానసికంగా కుంగదీస్తాయి. అదేవిధంగా చేతి వాచ్‌లే కాదు ఇంట్లో వాడే గడియారాలు ఆగిపోతే వెంటనే బ్యాటరీలను మార్చి వాడాలి. ఆగిపోయిన గడియారాలను వాడకూడదు. గడియారాలను శుభ్రంగా వుంచుకోవాలి. 
 
నిద్రించే సమయంలో చేతికి గడియారం కట్టడం కూడదు. అలాగే తలకు పక్కన గడియారాలను వుంచకూడదు. ఇతరుల చేతి వాచ్‌లను ఉపయోగించకూడదు. ఇవి వారి ప్రతికూలత ఇతరులపై  ప్రభావితం చేస్తుందని వాస్తు నిపుణులు అంటున్నారు. 
తర్వాతి కథనం
12-03-2026 గురువారం ఫలితాలు- దంపతుల మధ్య చిరు కలహం..