ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 అక్టోబరు 2021 (12:53 IST)

ఎల్బీ నగర్‌లో 110 కేజీల గంజాయి స్వాధీనం

తెలుగు రాష్ట్రాల్లో గంజాయి ఏరులై పారుతోంది. అనేక ప్రాంతాల్లో ఇబ్బడిముబ్బడిగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఇదే అంశంపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగుతోంది. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగర్‌లో గంజాయి భారీగా పట్టుబడింది. 
 
గంజాయి తరలిస్తున్న ఇద్దరు అంతర్‌ రాష్ట్ర నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 110 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ) నుంచి మహారాష్ట్ర, నాగ్‌పూర్‌కు తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.