ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 డిశెంబరు 2021 (15:05 IST)

మహేష్ బాబుకు మైనర్ సర్జరీ

తెలుగు అగ్ర హీరో మహేష్ బాబుకు చిన్నపాటి సర్జరీ జరిగినట్టు సమాచారం. దీంతో ఆయన ప్రస్తుతం దుబాయ్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే, ఆయనకు జరిగిన మైనర్ సర్జరీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది. 
 
అయితే, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల మేరకు మహేష్ బాబు మోకాలికి ఆపరేషన్ జరిగిందనీ, ఇందుకోసమే ఆయన దుబాయ్‌కు వెళ్ళినట్టు సమాచారం. మహేష్ బాబు తాజా చిత్రం "సర్కారు వారి పాట" అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఆయన గాయపడినట్టు సమాచారం.