మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 డిశెంబరు 2021 (17:15 IST)

టాలీవుడ్ పబ్‌పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి..

టాలీవుడ్ పబ్‌పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో తొమ్మిది మంది మహిళలతో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. గతంలో ఇదే పబ్‌ను లిబ్సన్ పబ్ పేరుతో నిర్వహించిన నిర్వాహకులు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చడంతో పోలీసులు పలు కేసు నమోదు చేశారు. 
 
తిరిగి అదే పబ్‌కు టాలీవుడ్ పబ్‌గా పేరు మార్చిన నిర్వాహకులు వేణు గోపాల్, సాయి భరద్వాజ్, పబ్ మేనేజర్ రాము.. మహిళలతో అసభ్యకరంగా పురుషులతో కలిసి నృత్యాలు చేయిస్తునారని పోలీసులు వివరించారు. 
 
పొట్టి దుస్తులు ధరించే మహిళలకు రోజుకు వెయ్యి ఇస్తూ పురుషులతో అసభ్యంగా నృత్యాలు చేయించడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నారని పోలీసులు వివరించారు. 
 
అదుపులోకి తీసుకున్న నిందితులను తదుపరి విచారణ నిమిత్తం పంజాగుట్ట పోలీసులకు అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ డీసీపీ తెలిపారు.