సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 డిశెంబరు 2021 (12:40 IST)

బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేయకూడదు: ఖట్టర్

namaz
గుర్గావ్‌లో బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేస్తే సహించేది లేదని అని హర్యానీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ స్పష్టం చేశారు. ప్రార్థనలు చేసుకునే హక్కు అందరికి ఉంటుంది.. కానీ ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ఉండకూడని.. రోడ్డు ట్రాఫిక్‌ను అడ్డుకునేలా ప్రార్థనలు ఉండకూడదని సూచించారు. 
 
నిర్ధేశించిన ప్రదేశాల్లోనే ముస్లింలు ప్రార్థనలు చేసుకోవాలని స్పష్టం చేశారు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్. కాగా ముస్లింలు ప్రతీ శుక్రవారం మసీదుకు వెళ్లి నమాజ్‌లు చేసుకుంటుంటారనే విషయం తెలిసిందే.
 
గత కొంత కాలంగా గురుగ్రామ్‌లో శుక్రవారం రోజు ముస్లింలు బహిరంగ ప్రదేశాల్లో అంటే రోడ్లపై బారులు తీరి నమాజులు చేసుకోవటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఆయా రోడ్లలో పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో హిందూ, ముస్లిం వర్గీయుల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. 
 
దీంతో సీఎం మనోహరర్ లాల్ ఖట్టర్ మాట్లాడుతూ..ఒకరిని ఇబ్బంది కలిగేలా ప్రార్థనలు చేసుకోవటం సరికాదని సూచించారు. 2018లో జరిగిన ఒప్పందం మేరకు నిర్దేశిత ప్రాంతాల్లోనే ముస్లింలు ప్రార్థనలు చేసుకోవాలని తెలిపారు. అన్ని పక్షాలతో మళ్లీ చర్చలు జరుపుతామని.. సామరస్య పూర్వకమైన పరిష్కారాన్ని రూపొందిస్తామని ఖట్టర్ చెప్పారు.