విశాఖ సభకు పవన్‌కి నో పర్మిషన్: తగ్గేదే లే అంటున్న జన సైనికులు
విశాఖ ఉక్కు ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు ఉక్కు పరిరక్షణా సభలో పాల్గొనేందుకు వెళ్లనున్నారు. ఐతే ఆయన సభలో పాల్గొనేందుకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. కానీ తాము వెనక్కి తగ్గేది లేదంటూ జనసైనికులు చెపుతున్నారు.
మరోవైపు కేంద్రం స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించాలని నిర్ణయం తీసుకుంటుంటే, దానికి మిత్రపక్షమైన జనసేన వ్యతిరేకంగా పోరాటం చేయడం చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ భాజపాతో తెగతెంపులు చేసుకుంటున్నారా అనే చర్చ కూడా సాగుతోంది.