గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: బుధవారం, 27 అక్టోబరు 2021 (22:05 IST)

ఇంట్లోనే ఉంటూ 110 కోట్ల బిజినెస్ చేస్తోన్న హీరో సినిమా, ఏంటది..?

తెలుగు సినిమా గొప్పతనాన్ని బాహుబలి ప్రపంచానికి చాటింది. టాలీవుడ్‌కు ఇంటర్నేషనల్ గుర్తింపును తీసుకొచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ ఇంట్లోనే ఉంటూ భారీ బిజినెస్‌ను తీసుకొచ్చాడు. స్టార్ హీరోస్ అంతా థియేటర్లో వందకోట్ల బిజినెస్ చేస్తే భీమ్లా నాయక్ మాత్రం థియేటర్లలోకి రాకుండానే 110 కోట్లు సంపాదించాడు.

 
సినిమాకు కాస్త క్రేజ్ ఉంటే చాలు హీరో, డైరెక్టర్ ఫ్లాప్‌లలో ఉన్నా ఓటిటిలు క్రేజీ ఆఫర్స్ ఇస్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ వంటి క్రేజీ స్టార్స్ సినిమా వస్తుందంటే ఊరుకుంటాయా. పవన్ కళ్యాణ్‌కు ఎన్ని హిట్స్ ఉన్నా ఇంతవరకు థియేటర్స్‌లో ఒక్క సినిమా కూడా వంద కోట్లను కలెక్ట్ చేయలేదు. అత్తారింటికి దారేది, వకీల్ సాబ్ వంటి సినిమాలు 60, 80 కోట్లు దగ్గరకు వెళ్ళి ఆగిపోయాయి.

 
పవన్ సినిమా ఇంతవరకు థియేటర్స్‌లో వందకోట్లు కలెక్ట్ చేయకపోయినా భీమ్లా నాయక్ సినిమా కోసం ఒక సంస్థ ఓటీటీ కోసం 100 కోట్లకు పైగా ఆఫర్ చేసిందట. ఓటీటీలో రావాలనుకున్న చిన్న సినిమాలో థియేటర్స్‌లో వస్తుంటే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ థియేటర్స్ లోకి రాకుండా ఉంటాడా..?

 
భీమ్లా ఓటీటీలోకి వస్తుందన్న ప్రచారాన్ని నిర్మాత ఖండించాడట. భీమ్లా నాయక్‌ను జనవరి 12వ తేదీన థియేటర్స్‌లో ప్రదర్సితం చేస్తామని నిర్మాత మరోసారి ప్రకటించడంతో సంక్రాంతి పండుగ బరిలో పవన్ సినిమా వున్నట్లయింది. సర్కారు వారి పాట రిలీజ్ వాయిదా పడినా రాధేశ్యామ్, భీమ్లా నాయక్ సినిమాలు మాత్రం తగ్గేట్లు కనిపించడం లేదు. బాహుబలికి గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడట భీమ్లా నాయక్.